బరువు తగ్గడానికి దానితో సంబంధం లేదు

కొంతమందిని లావుగా ఎందుకున్నావని అడిగితే వంశపారంపర్యంగా ఈ భారికాయం వచ్చిందని చెప్పేస్తారు.అది అబద్ధం అవకపోవచ్చు.

ఎందుకంటే కొంతమందికి ఇలా జరుగుతుంది.జీన్స్ వలన లావుగా ఉండొచ్చు.

కాని బరువు తగ్గడానికి జీన్స్ అడ్డుపడవని తాజాగా ఓ పరిశోధనలో తేలింది."ఇకపై బరవు తగ్గమంటే సాకుగా జీన్స్ ని చూపెట్టొద్దు.

మా అధ్యయనంలో తేలిందేంటంటే, మంచి ఆహారపు అలవాట్లు, ఫిజికల్లి యాక్టీవ్ గా ఉండటం ద్వారా మీ జీన్స్ తో సంబంధం లేకుండా బరువు తగ్గొచ్చు.బరువు తగ్గాలని నిర్ణయించుకోని, చక్కగా డైట్ ని ప్లాన్ చేసుకోని, మంచి వ్యాయామం చేస్తే జీన్స్ మోసుకొచ్చిన అవాంతరాలని దాటి బరువు తగ్గడం సాధ్యమైన విషయమే" అంటూ బ్రిటన్ కు చెందిన ప్రొఫేసర్ జాన్ మేథర్స్ చెప్పుకొచ్చారు.అవును, లావుగా ఉండటానికి కారణమయ్యే FTO జీన్, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు అడ్టంకులు మాత్రం సృష్టించట్లేదట.9500 మందిపై బరువు తగ్గుతున్న సమయంలో పరిశోధన చేసి ఈ విషయాలన్ని ఓ రిపోర్టులో తెలిపారు బ్రిటన్ పరిశోధకులు.

Advertisement
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి