General Election Schedule : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. 7 దశల్లో పోలింగ్

దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్( General Election Schedule ) విడుదల అయింది.

ఈ మేరకు లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) విడుదల చేసింది.

ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు ఒడిశా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.అలాగే దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ( Rajiv Kumar )తెలిపారు.

ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఉంటుందని, ఈసీకి వచ్చే ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులున్నాయన్నారు.వాటితో పాటు డ్రోన్ బేస్డ్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయన్న సీఈసీ రాజీవ్ కుమార్ ( Rajiv Kumar )ఫేక్ న్యూస్ ప్రచారంపై దృష్టి సారించామన్నారు.

Advertisement

దొంగ ఓట్లు వేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు