మహేష్ తో గీతా ఆర్ట్స్.. ఇంతకీ డైరెక్టర్ ఎవరు..?

సూపర్ స్టార్ మహేష్ గీతా ఆర్ట్స్ కాంబో సినిమా గురించి ఎప్పటి నుంచో డిక్షన్స్ లో ఉంది.

అయితే లేటెస్ట్ గా ఈ కాంబో గురించి అఫీషియల్ న్యూస్ లీక్ అయ్యింది.

గీతా ఆర్ట్స్ లో మహేష్ సినిమా కోసం కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా అది ఎందుకో వర్క్ అవుట్ అవ్వట్లేదు.కానీ లేటెస్ట్ గా ఈ కాంబో సెట్ అయినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది.

గీతా ఆర్ట్స్ లో మహేష్ సినిమా తర్వాత ప్రాజెక్ట్ అవుతుందని తెలుస్తుంది.

Advertisement

ఇంతకీ గీతా ఆర్ట్స్ లో మహేష్ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఉన్న దర్శకులకే ఛాన్స్ ఇస్తారా లేక స్టార్ డైరెక్టర్ ని తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.అసలైతే మహేష్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ వంగ ఉన్నాడు.

కాబట్టి మహేష్ తో గీతా ఆర్ట్స్ సినిమాకు అతనే డైరెక్టర్ అయ్యే ఛాన్స్ లు ఉన్నట్టు టాక్.ప్రభాస్ తో ఆల్రెడీ స్పిరిట్ ప్లాన్ చేసిన సందీప్ వంగ ఆ సినిమా తర్వాత మహేష్ తో చేస్తాడని టాక్.

Advertisement

తాజా వార్తలు