ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.
విపక్ష పార్టీ తెలుగుదేశం 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉంటూ ఈ ఐదు సంవత్సరాలలో వైసీపీ పాలనపై మండిపడుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో "రా కదలిరా" అనే సభలు నిర్వహిస్తున్నారు.
ఈ సభలలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించాలి అన్నదానిపై నాయకులకు కీలక సూచనలు చేస్తూ ప్రజలకు పలు హామీలు ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Former minister Ganta Srinivasa Rao ) సీఎం జగన్ పై ట్విట్టర్ లో సీరియస్ పోస్ట్ పెట్టడం జరిగింది.కొద్ది రోజుల క్రితం "సిద్ధం" అనే పేరుతో భీమిలి నియోజకవర్గంలో వైయస్ జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సభలో అర్జునుడు అంటూ జగన్ సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.
ఈ స్పీచ్ పై తాజాగా గంటా శ్రీనివాసరావు సీరియస్ పోస్ట్ పెట్టడం జరిగింది."నీకున్న అజ్ఞానానికి పురాణ పురుషుల గురించి మాట్లాడటం ఎందుకులే జగన్.
అర్జునుడు అంటే నీలాగా రాక్షసుడేమో అనుకుంటున్నట్టు ఉన్నావు.కాదు కాదు.
అతను ధర్మం వైపు నిలబడి యుద్ధం చేసినవాడు.ధర్మాన్ని గెలిపించినవాడు".
అని పోస్ట్ పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy