వినాయక చవితి రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాలను తీసుకువచ్చి వారి ఇంటిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు.

కొందరు వినాయకుడి విగ్రహాలను మూడు రోజులు ప్రతిష్టించగా మరి కొందరు 5, 7, 9, 11 రోజులపాటు వినాయకుడిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు.అయితే ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రోజు కొందరు తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు.

మరి ఈ పండుగ రోజు ఏ విధమైనటువంటి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

చేయాల్సిన పనులు

వినాయక చవితి పండుగ రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు తలంటుస్నానం చేసి వినాయకుడి పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి.వినాయకుడి పూజ చేసేవరకు వినాయకుడి మొహాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి ఉంచాలి.

Advertisement

ఇంట్లో వినాయకుడి పూజ చేసేవారు స్వామివారి తొండం ఎడమవైపు ఉండే విగ్రహాన్ని తీసుకురావాలి.కుడివైపు ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చినా కొన్ని నియమ నిష్టలను పాటించాల్సి ఉంటుంది.

వినాయకుడి పూజలో స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, గరిక, వెలగపండు తప్పనిసరిగా ఉండాలి.అలాగే స్వామివారికి బెల్లంతో తయారు చేసిన తీపి వంటలను నైవేద్యంగా సమర్పించాలి.

ఎంతో పవిత్రమైన ఈ రోజు పేదలకు మన శక్తిసామర్థ్యాల కొద్ది దానధర్మాలను చేయాలి.చేయకూడని పనులు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించే సమయంలో ఎప్పుడూ కూడా గేటుకు ఎదురుగా ప్రతిష్టించ కూడదు అదేవిధంగా ఇంటి ద్వారానికి ఎదురుగా వినాయకుడిని ప్రతిష్టించకూడదు.వినాయక చవితి రోజు స్వామివారి విగ్రహాన్ని బాత్రూం గోడకు దగ్గరగా ప్రతిష్టించి పూజలు చేయకూడదు.ముఖ్యంగా ఇంటి హాల్ లో స్వామి వారిని ఉంచి పూజ చేయటం వల్ల ఆ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తలెత్తుతాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.

ఎప్పుడూ కూడా స్వామివారు నాట్యమాడుతూ ఉన్నటువంటి విగ్రహాలను వినాయక చవితి రోజు ప్రతిష్టించ కూడదు.మన ఇంట్లో వినాయకుడి విగ్రహాలను మనమే నిమజ్జనం చేయకూడదు ఆ విగ్రహాలను తీసుకెళ్లి పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన చోట పెట్టి వాటితో పాటు నిమజ్జనం చేయాలి.

Advertisement

నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అలంకరణ లేకుండా నిమర్జనం చేయాలి.

తాజా వార్తలు