గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండబోతున్నాయా.. అదే సమస్య అంటూ?

రామ్ చరణ్( Ram Charan ) శంకర్( Shankar ) కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్( Game Changer ) మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే బుకింగ్స్ మాత్రం మరీ భారీ స్థాయిలో లేవు.చాలా చోట్ల బెనిఫిట్ షో టికెట్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ బాగానే ఉన్నా మరీ ఎక్కువగా అంచనాలు ఏర్పడకపోవడం ఒక విధంగా మైనస్ అని చెప్పవచ్చు.ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్ లో కూడా గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్లు అందుబాటులో ఉన్నాయనే సంగతి తెలిసిందే.

అయితే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు అటూఇటుగా ఉండే ఛాన్స్ ఉంది.చెన్నై, ముంబైలలో సైతం గేమ్ ఛేంజర్ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదు.

Advertisement

ఒకింత తక్కువ అంచనాలతోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లో పెంచిన టికెట్ రేట్లు( Ticket Rates ) గేమ్ ఛేంజర్ సినిమాకు ప్లస్ అవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు లభించకపోవడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అవుతుందని చెప్పవచ్చు.

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తాజాగా అన్ ప్రెడిక్టబుల్ సాంగ్ విడుదలైంది.

గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ కియారా అద్వానీకి( Kiara Advani ) కీలకం కానుంది.గేమ్ ఛేంజర్ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాబాయ్ వల్ల నాన్న బెల్ట్ తో కొట్టారు.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
డాకు మహారాజ్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా... బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!

చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

Advertisement

తాజా వార్తలు