టీజర్ తో రాబోతున్న కృష్ణ మనవడు

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన నట వారసుడుగా కూతురు కొడుకు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

ఈ మూవీలో గల్లా అశోక్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

డిఫరెంట్ కథలతో సినిమాలు చేసే వేణు శ్రీరామ్ ఈ మూవీ కోసం కూడా అలాంటి వినూత్నం కథాంశమే తీసుకున్నాడని టాక్.ఇక అమర్ రాజా మీడియాపై గల్లా జయదేవ్ ఈ మూవీని నిర్మించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.దానికి ఈ రోజే డేట్ ఫిక్స్ చేశారు.

Advertisement

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగానే ఈ టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఎంపీ గల్లా జయదేవ్ సైతం కొడుకుని హీరోగా నిలబెట్టడానికి ఏకంగా సినిమా రంగంలోకి నిర్మాతగా అడుగుపెట్టి మొదటి సినిమా చేస్తున్నారు.దేవదాస్ లాంటి ఫ్లాప్ తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా అతనికి హిట్ కావాలి.

మరి ఇలాంటి అంచనాల మధ్య తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.అలాగే తాజాగా వదిలిన ప్రీలుక్ లో గల్లా అశోక్ కౌబాయ్ గెటప్ లో దర్శనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు