యువ సంఘర్షణ సభలో గద్దర్ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో గద్దర్ ( Gaddar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నిర్వహించిన ఈ సభలో గద్దర్ కళాకారులతో కలసి పాటలు పాడటం జరిగింది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో పార్టీ ప్రకటన చేస్తానని పేర్కొన్నారు.త్వరలోనే పార్టీ పేరు ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.

అన్ని రాజకీయ పార్టీలు కలసి వస్తాయని అన్నారు.దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.

అంతేకాదు వచ్చే ఎన్నికలలో కేసీఆర్ పై( KCR ) పోటీ చేస్తానని గద్దర్ స్పష్టం చేశారు.

Gaddar Sensational Comments In Yuva Sangharshan Sabha Details, Congress, Gaddar
Advertisement
Gaddar Sensational Comments In Yuva Sangharshan Sabha Details, Congress, Gaddar

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ సభలో నిరుద్యోగులు మరియు యువత భారీ ఎత్తున హాజరు కావడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో జరగబోయే ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మరియు విద్యార్థులు కూడా.సభా ప్రాంగణంలో భారీగా తరలిరావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు