జాబ్స్: డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్... లక్షల్లో వేతనాలు, ఓ లుక్కేయండి!

ఒకప్పుడు మార్కెటింగ్ జాబ్ అంటే టై కట్టుకొని టిప్ టాప్ గా తయారై సేల్స్ చేయాల్సిన పరిస్థితి.

ప్రస్తుత ఈ స్మార్ట్ యుగంలో ఏం చేసిన స్మార్ట్ గానే చేయాలి.

ఆఖరికి మార్కెటింగ్ కూడా.ఈ క్రమంలోనే డిజిటల్ మార్కెటింగ్( Digital Marketing ) కెరీర్ అనేది స్టార్ట్ అయింది.

గత పది సంవత్సరాలుగా ఇందులో కెరీర్ మంచి ఊపందుకుంది.ఇపుడు కార్పొరేట్ సెక్టార్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు చేసేవారికి లక్షల్లో వేతనాలు అందుతున్నాయి అంటే అతిశయోక్తి లేదు.

అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రచారం కారణంగా కూడా డిజిటల్ మార్కెటింగ్ రంగం అనేది వేగంగా వృద్ధి చెందుతోంది అని చెప్పుకోవాలి.

Advertisement

గత 3-4 ఏళ్లలో చూసుకుంటే మన దేశంలో వేలకొద్దీ కొత్త స్టార్టప్‌లు( Startups ) పుట్టుకొచ్చాయి.వీటివల్ల డిజిటల్ రంగంలో లక్షలాది ఎంట్రీ లెవల్, మిడ్ లెవెల్ మరియు హై లెవెల్ ఉద్యోగాల రూపకల్పన జరిగింది.ఇంకా డిజిటల్ పరిశ్రమ యొక్క రికార్డు వార్షిక వృద్ధి కారణంగా, దేశంలో యునికార్న్ (వార్షిక టర్నోవర్ 7 వేల కోట్లు) కంపెనీల సంఖ్య మొదటిసారిగా 100 దాటడం విశేషం.

ప్రతి సంవత్సరం 30% వృద్ధితో పురోగమిస్తున్న డిజిటల్ పరిశ్రమలో ఇప్పటివరకు దాదాపు 88 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని సర్వేలు చెబుతున్నాయి.అయితే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో వివిధ కేటగిరీలను బట్టి వేతనాలు అనేవి ఉంటాయి.

ఉదాహరణకు ఇ-మెయిల్ మార్కెటర్ను తీసుకుంటే వీరు సర్వే సమాచారాన్ని ఇ-మెయిలర్ ద్వారా కస్టమర్‌లకు తెలియజేస్తారు.వీరికి ప్రారంభ ప్యాకేజీ సుమారు 4.3 లక్షలుగా ఉంటుంది.అలాగే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ విషయానికొస్తే వార్షిక ప్యాకేజీ 7.2 లక్షలుగా, సోషల్ మీడియా మేనేజర్( Social Media Manager ) విషయానికొస్తే వార్షిక ప్యాకేజీ 4 నుండి 6 లక్షలు వరకు ఉంటుంది.అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ సంవత్సరానికి 5 లక్షలు వరకు తీసుకుంటారు.

ఇక డిజిటల్ మార్కెటింగ్ కి ఎంతో కీలకమైన SEO / SEM స్పెషలిస్ట్ లు అయితే సంవత్సరానికి 6 నుండి 7 లక్షలు తీసుకుంటారు.ఇవే కాకుండా మరెన్నో అవకాశాలు డిజిటల్ మార్కెటింగ్ లో కలవు.

Advertisement

తాజా వార్తలు