కృష్ణా జిల్లాలో వెలుగులోకి ఘరానా మోసం

కృష్ణా జిల్లాలో ఘరానా కేటుగాడు పట్టుబడ్డాడు.ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతూ లక్షలు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు రాజేంద్ర డిప్యూటీ కలెక్టర్ నంటూ మోసానికి పాల్పడుతున్నాడని తెలిపారు.ఇందులో భాగంగానే ఓ మహిళ దగ్గర రూ.9 లక్షలు దండుకున్నాడు.మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు మరో లక్షన్నర ఇస్తానని పిలిపించి నిందితుడిని చాకచక్యంగా పోలీసులకు పట్టించింది.

దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఇప్పటివరకు రాజేంద్ర సుమారు రూ.80 లక్షలు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు.అనంతరం నిందితుడి నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన నకిలీ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు