కోదాడ చెరువులో నలుగురు విద్యార్ధులు గల్లంతు!

సూర్యాపేట సమీపంలో కోదాడ పెద్ద చెరువులో ఈతకి వెళ్ళిన నలుగురు విద్యార్ధులు ప్రమాదవశాత్తు చెరువులోకి జారిపడి గల్లంతయ్యారు.నలుగురు విద్యార్ధులు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తుంది.

సమీపంలో చెరువు వద్దకి వెళ్ళిన విద్యార్ధులలో ముందుగా సమీర్ చెరువులో దిగిన తర్వాత ప్రమాదానికి గురి కావడంతో అతనితో వచ్చిన ముగ్గురు విద్యార్ధులు ప్రవీణ్, మహిధర్ తో మరో విద్యార్ధి భవానీ ప్రసాద్ లు కాపాడే ప్రయత్నం చేశారు.దీంతో వాళ్ళు కూడా చెరువులో ఈత కొట్టలేని పరిస్థితిలో నలుగురు గల్లంతయినట్లు తెలుస్తుంది.

ఇక సంఘటన గురించి తెలిసిన స్థానికులు పెద్ద చెరువు దగ్గరకి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.చనిపోయిన వారి మృతదేహాల్ని బయతని తీసే ప్రయత్నం పోలీసులు స్థానికుల సాయంతో చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఆ విద్యార్ధులు ఎ గ్రామానికి చెందిన వారు అనే విషయం తెలియాల్సి వుంది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

తాజా వార్తలు