నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన కారు ఓ బైకును ఢీకొట్టింది.

చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.కాగా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు