తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపి మాజీ మంత్రి కొడాలి నాని...

తిరుమల శ్రీవారిని వైసీపి మాజీ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.

ఐ.పి విరామ సమయంలో కొడాలి నాని స్వామి వారి‌ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపకు వచ్చిన కొడాలి‌ నాని మీడియాతో మాట్లాడుతూ.

నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గ ప్రజలు., సీఎం జగన్ కుటుంబ సభ్యులు, వైసీపీ ప్రభుత్వం బాగుండాలని శ్రీనివాసుడిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

కాయలు ఉన్న చెట్లపైనే రాళ్ళ దెబ్బలు తగులుతాయని, పచ్చ మీడియా, ప్రతిపక్షం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని ఆయన విమర్శించారు.దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని సీఎం జగన్ భావిస్తున్నారని, ప్రజలకు మేలు చేయాలని మా ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జగన్ ను భ్రష్టు పట్టించాలనే కొన్ని మీడియా సంస్థలు, దత్తపుత్రుడు, టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయని, తప్పు ఉంటే మమల్ని దేవుడు శిక్షిస్తాడని కొడాలి‌ నాని చెప్పారు.

Advertisement