మాజీ ఎంపీ పొంగులేటి దారెటు..?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే విషయం పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది.

బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న పొంగులేటి వేరే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ, కాంగ్రెస్ తో పాటు వైఎస్ఆర్టీపీలలో దేనివైపు పొంగులేటి మొగ్గు చూపుతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే ఓ ఎంపీతో పాటు నాలుగు ఎమ్మెల్యేల సీట్లను పొంగులేటి వర్గం ఆశిస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో అన్ని స్థానాలు ఇచ్చే అవకావం తక్కువగా ఉండగా వైఎస్ఆర్ టీపీలో సీట్ల సమస్య ఉండదని భావిస్తున్నారు.గతంలోనూ పొంగులేటి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

దీంతో ఆయన వైఎస్ఆర్ టీపీలోనే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఖమ్మం జిల్లా సీపీఐ నేతలు కూడా పొంగులేటి వెంట నడుస్తామని చెబుతున్నారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు