సీఎం జగన్ పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికి వారు తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నారు.

మరోపక్క 2019 ఎన్నికల సమయంలో జరిగిన వైయస్ వివేక హత్య కేసు విచారణ ఈనెల 30కి ముగియనుంది.దీంతో అరెస్టులు తప్పవు అన్న ప్రచారం జరుగుతుంది.ఇటువంటి తరుణంలో మాజీమంత్రి డీఎల్ రవీంద్రనాథ్ రెడ్డి( DL Ravindranath Reddy ) ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో మరోసారి అధికారంలోకి రావడానికి జగన్ ( YS Jagan Mohan Reddy )ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో షర్మిల, విజయమ్మ( Y.S.Sharmila ) జాగ్రత్తగా ఉండాలి.ఎవరినైనా గొంతు కోసి అధికారంలోకి రావాలనే ఆలోచనలో జగన్ ఉన్నారనే అనుమానం తనకుందని డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రశాంత్ కిషోర్ గతంలో ఇచ్చిన ఆలోచనలు వర్కౌట్ అయ్యాయి.గతంలో కోడి కత్తి, వివేక హత్య కేసుల వల్లే జగన్ అధికారంలోకి వచ్చారంటూ డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా లో ఆ కామెడీ సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారా..?

తాజా వార్తలు