వైకుంఠపురంలో 50 లక్షల రూపాయలతో అంగన్వాడి పాఠశాలకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో జరుగుతున్న అభివృద్ధి పై తెలుగుదేశం పార్టీ నేతలు కళ్ళులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

నెల్లూరు నగరంలోని బోడిగాడితోట ప్రాంతంలో పర్యటించిన ఆయన వైకుంఠపురంలో 50 లక్షల రూపాయలతో అంగన్వాడి పాఠశాలకు శంకుస్థాపన,బోడిగాడి తోటలో పార్థివ దేహముల దహనశాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిపై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

చందాల రెడ్డి గా పేరుగాంచిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు.నెల్లూరు నగరం నియోజకవర్గం నుండి మూడవసారి గెలుపొంది, హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?

తాజా వార్తలు