పాన్ తిన్న తర్వాత తినకూడని ఆహార పదార్థాలు..

మన భారతదేశంలో చాలామంది ప్రజలు భోజనం చేసిన తర్వాత కిల్లి నములుతూ ఉంటారు.

కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కిల్లి తింటే వారికి అదొక సంతృప్తిగా ఉంటుంది.

అందులోనూ పాన్ లో వాడే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఆయుర్వేద గ్రంథాలైన చరకసహితం, శుశ్రుత సంహితంలో సంహితంలో తమలపాకు గొప్పతనాన్ని, చికిత్స సామర్థ్యం గురించి వెల్లడించారు.

తమలపాకులు తినడం వల్ల అందులోని పోషకాలు వెచ్చదనాన్ని అందిస్తాయి.వీటిని తినడం వల్ల కడుపు, ప్రేగుల్లో పి.

హెచ్ అసమతుల్యతను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది.జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Advertisement

తమలపాకులు తినడం వల్ల భోజనం జీర్ణం అవుతుందని ఆయుర్వేదంలో ఉంది.తమలపాకును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

ఇప్పుడు పాన్ ను రకరకాలుగా తీసుకుంటూ ఉన్నారు.అయితే తిన్న తర్వాత తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించిన విషయం చాలామందికి తెలియదు.

కిల్లి తిన్న తర్వాత ఆహారపదార్థాలు తినేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.పాన్ తిన్నాక ఒక గంట వరకు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.

ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

కిల్లి తిన్న తర్వాత ఒక గంట వరకు పాలు అస్సలు తాగకూడదు.తాగితే దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.పాన్ తిన్న తర్వాత ఎలాంటి మందులను వేసుకోకూడదు.

Advertisement

లేకుంటే కొందరిలో తలనొప్పి, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కిల్లి తిన్న తర్వాత ఒక గంట పాటు ఏమి తినకుండా అలా ఉండి ఆ తర్వాత మందులు వేసుకోవడం మంచిది.

కిల్లి తిన్న తర్వాత పండ్ల రసాలు త్రాగకూడదు.ఎందుకంటే అవి నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే మసాలాతో వండిన ఆహార పదార్థాలను కిల్లి తిన్న తర్వాత తినకూడదు.

ఇలా తినడం వల్ల మలబద్ధకంతో పాటు జిర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.అంతేకాకుండా పాన్ తిన్న తర్వాత చల్లని నీళ్లు తాగడం వలన శ్వాసకోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

అందుకోసం చల్లని నీటిని అస్సలు తాగకూడదు.

తాజా వార్తలు