ఈ ఆహారాలు రక్తపోటు (BP) ని పెంచుతాయని తెలుసా

రక్తపోటు పెరగటం వలన చిన్న రక్త నాళాలు పాడవటం, రక్తనాళాల గోడలు పాడవటం వంటి కారణాలు గుండె ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

అలాగే గుణే పనితీరు మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది.

రక్తపోటు ఎక్కువగా ఉన్నా లేదా వచ్చే సూచనలు ఉన్నా ఇప్పుడు చెప్పే ఆహారాలను తినటం మానేస్తే అది రక్తపోటు తగ్గటానికి మరియు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

టిన్ లలో నిల్వ చేసిన ఆహారాలను అసలు ఉపయోగించకూడదు.ఈ రోజుల్లో చాలా వాటిని టిన్ లలో నిల్వ చేస్తున్నారు.

ఇలా నిల్వ ఉండటానికి సోడియం ఉపయోగిస్తారు .రక్తంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది.

Advertisement

కొవ్వు ఉన్న ఆహారాల పదార్ధాలను తింటే రక్తంలో కొలస్ట్రాల్ పెరిగి రక్త ప్రవాహానికి అడ్డం పడుతుంది.దాంతో రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఒక గ్లాస్ బీర్ లేదా వైన్ ని రెగ్యులర్ గా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే రక్తపోటు సమస్యను ఏరి కోరి తెచ్చుకున్నట్టే.

రోజుకి ఒక కప్పు కాఫీ త్రాగితే పర్వాలేదు.కానీ ఎక్కువగా త్రాగితే మాత్రం కాఫీలోని కెఫీన్ రక్తనాళాలు ముడుచుకొనేలా చేస్తుంది.దాంతో రక్తపోటు వస్తుంది.

బిపి ఉన్నవారు కాఫీ త్రాగకుండా ఉంటేనే మంచిది.గేదె పాలలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల పాలను కూడా త్రాగటం తగ్గించటం మంచిది.ఇది కూడా రక్తపోటును పెంచుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 23, సోమవారం 2023

మీ ఆహారంలో ఎక్కువ చక్కెర ఉండే పదార్థాలు తినటం వలన డయాబెటిస్, స్థూలకాయం సమస్యలు వస్తాయని తెలిసిన విషయమే.ఎక్కువ చక్కర పదార్ధాలు తినటం వలన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తపోటు వస్తుంది.

Advertisement

కాబట్టి సాధ్యమైనంత వరకు చక్కెర ఉన్న పదార్దాలను తినటం తగ్గించాలి.

తాజా వార్తలు