రోజు నైట్ ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మేకప్ లేకపోయినా సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతారు!

ఇటీవల రోజుల్లో కాలేజీకి వెళ్లే అమ్మాయిలు దగ్గర నుంచి ఆఫీసులకు వెళ్లే యువతుల వరకు మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.

మేకప్ ( Makeup )అనేది నిత్యవసరంగా మారిపోయింది.

కానీ కొందరు మాత్రం మేకప్ లేకపోయినా చాలా అందంగా కనిపిస్తుంటారు.అలాంటి వారిని చూస్తే కాస్త అసూయ కలగ‌డం సహజమే.

కానీ అటువంటి చర్మాన్ని ఎవరైనా పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Follow This Simple Tip For Glowing Skin Without Makeup Simple Tip, Glowing Skin
Advertisement
Follow This Simple Tip For Glowing Skin Without Makeup! Simple Tip, Glowing Skin

ముందుగా ఒక గిన్నెలో చిటికెడు కుంకుమ పువ్వు( Saffron flower ) మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు గోరువెచ్చని పాలు( Warm milk ) పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరగా కుంకుమపువ్వు నానబెట్టుకున్న మిల్క్ ను కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతల అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజు నైట్ ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మేకప్ లేకపోయినా మీ చర్మం సూపర్ గ్లోయింగ్ గా షైనీ గా మెరుస్తుంది.

చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా మాయం అవుతాయి.మొటిమలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

ముడతలు, చర్మం సాగటం, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

చర్మం యవ్వనంగా మారుతుంది.

Advertisement

ఇక ఈ సింపుల్ చిట్కాను పాటించడంతో పాటు మంచి డైట్ ను ఫాలో అవ్వండి.షుగర్ ఫాస్ట్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని అవాయిడ్ చేయండి.కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, గింజలు, మొలకెత్తిన విత్తనాలు వంటివి ఉండేలా చూసుకోండి.

నిత్యం వ్యాయామం చేయండి.మరియు శరీరానికి అవసరమయ్యే వాటర్ ని అందించండి.

ఇవి ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచుతాయి.మేకప్ లేకపోయినా మిమ్మల్ని కాంతివంతంగా, ఆకర్షణీయంగా మెరిపిస్తాయి.

తాజా వార్తలు