నైట్ నిద్రించే ముందు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ముఖం స్మూత్ గా సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది!

ఉదయం నిద్రలేచే సమయానికి ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే ఎంతో ఉత్సాహంగా రోజును ప్రారంభిస్తారు.

అయితే అలా ప్రారంభించాలి అంటే కచ్చితంగా నైట్ నిద్రించే ముందు మీరు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటించాల్సిందే.

ఈ సింపుల్ చిట్కా వల్ల మీ ముఖ చర్మం ఉదయానికి స్మూత్ గా, సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.దాంతో మీ ఉదయం ఎంతో అద్భుతంగా మొదలవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు( milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement
Follow This Simple Tip For A Smooth And Super Glowing Face! Smooth Skin, Glowing

ఈ రైస్ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ), రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

Follow This Simple Tip For A Smooth And Super Glowing Face Smooth Skin, Glowing

దాంతో ఓ మంచి మసాజ్ క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్ర‌మ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే నాలుగు రోజుల పాటు వాడుకోవచ్చు.నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని కనీసం ప‌ది నిమిషాల పాటు వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

Follow This Simple Tip For A Smooth And Super Glowing Face Smooth Skin, Glowing

మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మం స్మూత్ గా, సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.ఉదయానికి అందంగా ఆకర్షణీయంగా మెరుస్తారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఈ క్రీమ్ ను వాడటం వల్ల స్కిన్ టోన్ సైతం అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు