పైసా ఖర్చు లేకుండా ఈ సింపుల్ చిట్కాలతో ముత్యాల్లాంటి దంతాలను మీ సొంతం చేసుకోండి!!

చిరునవ్వుకు అందం తెచ్చేది తెల్లటి మెరిసేటి దంతాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే చాలా మందికి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో కనిపిస్తుంటాయి.

ఇలాంటి వారు తమ దంతాలను అద్దంలో చూసుకున్న ప్రతిసారి తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు.ఎలాగైనా దంతాలను తెల్లగా మెరిపించుకునేందుకు తపన పడుతుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.ఈ చిట్కాలతో ఖర్చు లేకుండా సులభంగా ముత్యాల్లాంటి దంతాలను మీ సొంతం చేసుకోవచ్చు.

ఒకప్పుడు మన పెద్దలు వేప పుల్లనే టూత్ బ్రష్ గా వాడేవారు.వేప పుల్లతో బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారడమే కాకుండా తెల్లగా సైతం మారతాయి.

Advertisement

కాబట్టి వీలుంటే వారానికి కనీసం మూడు నాలుగు రోజులైనా వేప పుల్లతో బ్రష్ చేయడానికి ప్రయత్నించండి.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను నాలుగైదు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా దంతాలను నోటిని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.వైట్ అండ్ షైనీ టీత్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

అరటిపండు తిన్నాక తొక్కను పారేయడం మనందరికీ ఉన్న అలవాటు.అయితే అరటిపండు తొక్క కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా అరటిపండు తొక్కతో దంతాలపై క్రమం తప్పకుండా సున్నితంగా రుద్దితే పసుపు రంగు పోతుంది.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

దంతాలు తెల్లగా మారతాయి.ఇక ఈ సింపుల్ చిట్కాలు పాటించడంతో పాటు స్వీట్స్, జంక్ ఫుడ్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి.

Advertisement

వీలైతే మానేయండి.పాలు, పెరుగు, గుడ్లు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కూరగాయలు, నట్స్ అండ్‌ సీడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.

ఇవి దంతాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

తాజా వార్తలు