ఈ ఇంటి చిట్కాలతో నెలసరి అవ్వదు ఇక ఆలస్యం..!

సాధారణంగా కొందరికి నెలసరి టైమ్‌ టు టైమ్‌ వస్తుంది.మరికొందరికి నెలసరి సమయం కన్నా ముందే వచ్చేస్తుంది.

ఇంకొందరికి ఎప్పుడొస్తుందో కూడా తెలియదు.చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది.

నెలసరి క్రమం తప్పడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ఈ సమస్యను సరి చేసుకోవడానికి మందులు కూడా వాడుతుంటారు.

అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్(irregular periods) కి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ఉల్లి (Onion) చేసే మేలు తల్లి కూడా చేయలేదని అంటుంటారు.ఎందుకంటే ఉల్లిపాయ(Onion) అనేక పోషకాలకు ఔషధ గుణాలకు పవర్ హౌస్ లాంటిది.ఉల్లిపాయ ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

నెలసరి సమస్యల‌ను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ లో క‌ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించి వడకట్టాలి.ఇప్పుడు ఈ ఉల్లి వాటర్ లో వన్ టీ స్పూన్ ఆర్గానిక్ బెల్లం (Organic jaggery)తురుము కలిపి సేవించాలి.

వారానికి ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే నెలసరి ఆలస్యం కాకుండా సరైన సమయానికి వస్తుంది.పైగా ఈ డ్రింక్ నెలసరి నొప్పులను దూరం చేయడంలో కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?
నేరేడు పండ్లతో ఇలా చేస్తే శని దోష నివారణలు దూరం..!

ఇక నెలసరి సక్రమంగా రావాలంటే దాల్చిన చెక్కను(Cinnamon stick) కూడా మీరు ఉపయోగించవచ్చు.ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి మ‌రియు రుచికి సరిపడా బెల్లం కలుపుకుని సేవించాలి.ప్రతిరోజు ఈ దాల్చిన చెక్క పాలు తాగితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్న మాటే అనరు.

Advertisement

పైగా ఈ మిల్క్ మంచి నిద్రను ప్రమోట్ చేస్తుంది.ఎముకలను బలోపేతం చేస్తుంది.

మోకాళ్ల నొప్పులకు చెక్ పెడుతుంది.

తాజా వార్తలు