స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

వేస‌వి కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య స‌న్ ట్యాన్‌.

కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు స‌న్ ట్యాన్‌కు గురై చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంటుంది.

ఈ స‌న్ ట్యాన్ నుంచి త‌ప్పించుకునేందుకు ఖ‌రీదైన సన్ స్క్రీన్ లోషన్లు కొనుగోలు చేసి వాడ‌తారు.కానీ, ఎంత ఖ‌రీదైన సన్ స్క్రీన్ లోషన్ వాడినా.

దాని ప్ర‌భావం కొన్ని గంట‌లే ఉంటుంది.ఆ త‌ర్వాత మ‌ళ్లీ మామూలే.

దాంతో స‌న్ ట్యాన్ బారిన ప‌డిన వారు.ఆ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

Advertisement

అయితే స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్ట‌డంలో అవిసె గింజ‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి చ‌ర్మానికి అవిసె గింజ‌ల‌ను ఎలా వాడాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందు అవిసె గింజ‌ల‌ను పొడి చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో అవిసె గింజ‌ల పొడి, నిమ్మ రసం మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్ అయిన ప్రాంతంలో పూసి.

ఇర‌వై నిమిషాల త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే స‌న్ ట్యాన్ స‌మ‌స్యే ఉండ‌దు.

అలాగే అవిసె గింజల పొడిలో చిటికెడు ప‌స‌ుపు మ‌రియు పెరుగు వేసి క‌లుపుకోవాలి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.బాగా డ్రై అవ్వ‌నివ్వాలి.ఆ త‌ర్వాత కొద్దిగా నీళ్లు జల్లి వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా స‌న్ ట్యాన్ దూరం అవుతుంది.అవిసె గింజ‌ల పొడిలో కొద్దిగా చంద‌నం పొడి మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్ అయిన చోట అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో వాష్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల స‌న్ ట్యాన్ స‌మ‌స్య త‌గ్గడంతో పాటు.చ‌ర్మం తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.

తాజా వార్తలు