విజయవాడ బందర్ రోడ్డులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

విజయవాడలోని బందర్ రోడ్డు( Bandar Road Vijayawada )లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

కేడీసీసీ బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్( Medical Godown ) లో మంటలు చెలరేగాయి.

గోడౌన్ లో అలుముకున్న మంటలు( Fire Accident ) ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే మొత్తం ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.కాగా మూడు అంతస్థుల్లోకి మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు