అక్కడ ఉమ్మి వేస్తే 'లక్ష' రూపాయల ఫైన్ !

ఎక్కడ పడితే ఉమ్మి వేయడం చాలామందికి అలవాటు.నోట్లో కిళ్ళీలు నవిలే వారి సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు.

ఇలాంటి వారి వల్ల పట్టణాల్లో అపరిశుభ్రవాతావరణం ఏర్పడడంతో పాటు కొత్తగా నగరాలకు వచ్చే పర్యాటకులకు ఇవి ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి.ఇలాంటి విషయాలను సీరియస్ గా పరిగణించిన కొన్ని కొన్ని నగరాలు చిన్న చిన్న జరిమానాలు విధిస్తూ.

సరిపెడుతున్నాయి.ఇటీవల మహారాష్ట్రలోని పుణెలో రోడ్లపై ఉమ్మివేసేవారికి జరిమానా విధించడంతోపాటు దానిని వేసిన వారితోనే కడిగిస్తున్నారు.

మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు.

Advertisement

తాజాగా ఇటువంటి నిర్ణయాన్నే పశ్చిమబెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వం తీసుకుంది.ఇకపై కోల్‌కతాలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే.భారీ అంటే మామూలు భారీ కాదు.

ఏకంగా లక్ష రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.చిన్నచిన్న జరిమానాలతో లాభం లేదని భావించిన ప్రభుత్వం ఏకంగా పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, ఉమ్మి వేసినా కనిష్టంగా రూ.50, గరిష్టంగా రూ.5 వేలు జరిమానా విధించేవారు.అయితే, దీనివల్ల పెద్దగా ఫలితం ఉండకపోవడంతో జరిమానాను గరిష్టంగా లక్ష రూపాయలకు పెంచారు.

ఇందుకోసం అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టారు.ప్రభుత్వ ఆదేశాల అమలు కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023
Advertisement

తాజా వార్తలు