స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే అంతే సంగతులు

మీరు స్మార్ట్‌ఫోన్ కొనడానికి షాప్ లేదా ఆన్‌లైన్ సైట్‌కి వెళితే, అక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనే పదం వినిపిస్తుంది.

కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటి పదం ఉపయోగించకపోయినప్పటికీ ఇప్పుడు ఇది బ్రాండింగ్‌లో భాగమైంది.

గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు హ్యాండ్‌సెట్‌కు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని జోడించాయి.దీని కారణంగా ఫోన్‌లు వేగంగా ఛార్జ్ అవుతాయి.

నేటి వేగవంతమైన మెట్రో లైఫ్-స్టైల్లో రాపిడ్ లేదా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఒక గొప్ప సాంకేతికత.ఈ సాంకేతికత ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అది అంతే హానికరం.

వాస్తవానికి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవు.ఒకవేళ చేసినా వాటికి వేర్వేరు పరిమితులు ఉంటాయి.

Advertisement

ఉదాహరణకు, చాలా Samsung ఫోన్‌లలో, 18W లేదా 25W ఛార్జింగ్ మాత్రమే కనిపిస్తుంది.మరోవైపు, Realme స్మార్ట్‌ఫోన్‌లు - 18W, 33W, 67W , కొత్తగా 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి.

Xiaomi 120W వరకు ఛార్జింగ్‌ని కూడా అందిస్తోంది.కాగా ఫోన్‌లు డెడ్ అవుతున్నాయని, లేదా ఆన్ చేసిన వెంటనే అవి ఆఫ్ అవుతుంటాయని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు.

ఈ రకమైన సమస్య ముఖ్యంగా పాత పరికరాల్లో (సుమారు రెండు సంవత్సరాల క్రితం) కనిపిస్తుంది.

పరికరం చనిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, వేగంగా ఛార్జింగ్ అయ్యే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి.నిజానికి, చాలా మందికి ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించే అలవాటు ఉంటుంది.ప్రతి ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండదు కాబట్టి, ఫోన్ డెడ్ అయ్యే సందర్భాలు ఎదురవుతాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

చాలా సార్లు వినియోగదారులు ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి టైప్-సి ఛార్జింగ్‌తో కూడిన ల్యాప్‌టాప్ ఛార్జర్‌ను కూడా ఉపయోగిస్తారు.అలాంటి అలవాట్లు ఫోనుకు హాని కలిగిస్తుంది.ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు వేగంగా వేడెక్కుతాయి.

Advertisement

అప్పుడు మదర్‌బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్‌ పేలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి బాక్స్‌లో వచ్చే ఒరిజినల్, స్టాండర్డ్ ఛార్జర్‌ని ఉపయోగించడం ఉత్తమం.