పొట్టిగా ఉన్నా ఆ లక్షణం ఉంటే పెళ్లి చేసుకుంటా.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎత్తు ఉన్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) ఒకరు.

జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన ఫరియా అబ్దుల్లా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏ విధంగా ఉండాలో తాజాగా చెప్పుకొచ్చారు.

నాకు కాబోయే భర్త నాకంటే ఎత్తు తక్కువ ఉన్నా ఏ మాత్రం అభ్యంతరం లేదని ఆమె తెలిపారు.నాకు కాబోయే భర్తలో మంచి హాస్య చతురత ఉండాలని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.

అలాంటి ఫన్ కుర్రాడు దొరికితే నాకంటే పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు.ఈ లైఫ్ లో అన్నీ బాధలే అని కనీసం పెళ్లి చేసుకోబోయేవాడు ఫన్ గా ఉంటే బాగుంటుంది కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలు ఇవ్వాల్సి వస్తే నేను హీరోయిన్( Heroine ) అనే విషయాన్ని మాత్రం దాచిపెడతానని ఆమె పేర్కొన్నారు.

Advertisement

నా ఫోటోను కూడా లైట్ గా బ్లర్ చేస్తానని ఆమె తెలిపారు.నేను హీరోయిన్ అని తెలిస్తే వేర్వేరు ఆలోచనలు, అంచనాలు వచ్చేస్తాయని ఫరియా అబ్దుల్లా కామెంట్లు చేశారు.నేను హీరోయిన్ కాదని తెలిస్తే ఎదుటి వ్యక్తి నుంచి నిజాలు బయటికి వస్తాయని ఆమె తెలిపారు.

ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku Movie ) సినిమాతో ఫరియా అబ్దుల్లా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఫరియా అబ్దుల్లా రెమ్యునరేషన్( Faria Abdullah Remuneration ) పరిమితంగా ఉంది.

ఫరియా అబ్దుల్లా ఇతర భాషలపై సైతం దృష్టి పెడితే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఫరియా అబ్దుల్లాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఆ ఒక్కటి అడక్కు సినిమా మే నెల 3వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.

ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు