వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సాధారణంగా ఒక డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఉందని చెప్పడం చాలా రేర్ అనే సంగతి తెలిసిందే.

గత పదేళ్లుగా తారక్ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నారు.

రభస సినిమా తర్వాత తారక్ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరచలేదనే సంగతి తెలిసిందే.తారక్ ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్( Vetrimaaran ) డైరెక్షన్ లో నటించాలని ఉందని తారక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయితే విడుదల2 మూవీ( Vidudala 2 Movie ) ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.విడుదల1 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది.సెకండాఫ్, స్లో నరేషన్ ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

సినిమాలో కొన్ని సీన్లు బాగానే ఉన్నా మెజారిటీ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

Advertisement

వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు మంచి సినిమాలుగా పేరును సొంతం చేసుకునా ఈ సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చెప్పలేము.తారక్ అట్లీ, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ డైరెక్టర్లకు సంబంధించి తారక్ మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది.

తారక్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టే ఛాన్స్ ఉంది.వేగంగా సినిమాల్లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్న తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

అప్పుడు పొగడని నోర్లు ఇప్పుడు విమర్శించడం కరెక్టేనా... బన్నీ పై గుర్రుగా ఉన్న సినీ పెద్దలు?
Advertisement

తాజా వార్తలు