Deepika Padukone : దీపిక కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారా.. అందుకే అలాంటి పోస్ట్ షేర్ చేశారా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి దీపిక పదుకొనే( Deepika Padukone ) ఒకరు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే మరో స్టార్ హీరో అయినటువంటి రణవీర్ సింగ్ ( Ranveer Singh ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు.ఈ సినిమాల సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఈ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసిందని చెప్పాలి.

ఇలా వీరిద్దరూ 2018 వ సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు.ఈ విధంగా పెళ్లి చేసుకున్నప్పటికీ రణబీర్ అలాగే దీపిక ఇద్దరు కూడా సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక వీరి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించలేద.

Advertisement

దీంతో వీరికి తరచూ పిల్లలు ఎప్పుడూ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే తాజాగా ఈమె అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారు.త్వరలోనే తాను తల్లి కాబోతున్నానని తమ మొదటి బేబీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రాబోతోంది అంటూ దీపిక చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ విధంగా తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని దీపిక ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఏదైనా సెలబ్రిటీలు అభిమానులు ఈమెకి శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే తాజాగా దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ ( Pregnancy ) గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ కనుక గమనిస్తే అందులో పింక్ కలర్ డ్రెస్ తో పాటు బ్లూ కలర్ డ్రెస్సులు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇంత చిన్న లాజిక్ పట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో ఈమె ప్రెగ్నెన్సీ పై చర్చలు మొదలుపెట్టారు.దీపికా పదుకొనే ఒకేసారి ట్విన్స్( Twins ) కి జన్మనివ్వబోతున్నారు.ఇందుకు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్న బ్లూ, పింక్‌ షేడ్స్‌లో షూస్‌, టోపీలు, ఫ్రాక్‌, ఇతర బొమ్మలను ఉదహరిస్తున్నారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

పింక్‌ కలర్‌ ఆడ బిడ్డకు, బ్లూ కలర్‌ మగబిడ్డకు సంకేతం కాబట్టి, దీపికా రణ్‌వీర్‌ దంపతులకు ట్విన్స్‌ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు ఈమె ప్రెగ్నెన్సీ పై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.ఇకపోతే ఈ పోస్ట్ పై మరొక నెటిజెన్స్( Netizens ) స్పందిస్తూ ఆమెకు ఇంక మూడవ నెల కాబట్టి బేబీ ఎవరు అనే విషయం తెలియదు అందుకే పింక్ కలర్ తో పాటు బ్లూ కలర్ పెట్టారని ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు.

Advertisement

ఏది ఏమైనా ఈమె ప్రెగ్నెన్సీ గురించి శుభవార్తను చెప్పిందో లేదో అప్పుడే తనకు పుట్టబోయే బిడ్డ ఎవరు అనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

తాజా వార్తలు