ప్రమోషన్స్ కోసం పబ్లిక్ లో న్యూసెన్స్.. విశ్వక్ సేన్ పై మండిపడుతున్న నెటిజన్స్?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.

ఈ సినిమాకు విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మే 6వ తేదీన విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్రబృందం చేయించిన ఒక ఫ్రాంక్ వీడియో పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.అసలేం జరిగిందంటే.

హీరో విశ్వక్ సేన్ తాజాగా ఫిలిం నగర్ రోడ్డులో వెళ్తుండగా ఇంతలో ఒక యువకుడు విశ్వక్ సేన్ వెళ్తున్న కారుకి అడ్డంగా పడుకుని నడిరోడ్డుపై నానా హంగామా సృష్టిస్తూ హల్చల్ చేశాడు.విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరో పాత్ర పేరు అర్జున్ కుమార్.

Advertisement
Fan Suicide Prank Vishwaksen Ashoka Vanam Lo Arjuna Kalyanam, Vishwak Sen, Ashok

అప్పుడు సదరు యువకుడు అల్లం అర్జున్ కుమార్ కి 33 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాలేదు కదా సార్ నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటున్న అంటూ డ్రామా మొదలు పెట్టగా, అప్పుడు విశ్వక్ సేన్ కూడా తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా డ్రామాను రక్తి కట్టిస్తూ బాగా నటించాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Fan Suicide Prank Vishwaksen Ashoka Vanam Lo Arjuna Kalyanam, Vishwak Sen, Ashok

ఈ వీడియో చూసిన నెటిజన్స్ సినిమా ప్రమోషన్స్ కోసం మరి ఇంతగా దిగజారాలా అంటూ చిత్ర బృందం పై ఫైర్ అవుతున్నారు.సినిమా బాగుంటే ఆడుతుంది,లేకపోతే ఆడియన్స్ చూడరు.అంతే కానీ ఇలాంటి జిమ్మిక్కులు వర్కవుట్ కావని ఎప్పుడు తెలుసుకుంటారు.

అలాగే ఫ్రాంక్ పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.ఆ వీడియోలో ఆ యువకుడు అల్లం అర్జున్ కుమార్ కావాలి అనగా, నేనే బ్రో అని విశ్వక్ సేన్ అనగా కాదు బ్రో నువ్వు విశ్వక్ సేన్ వి,నాకు అల్లం అర్జున్ కుమార్ కావాలి అంటూ నడిరోడ్డు పైన నానా రచ్చ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు