ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి..: చంద్రబాబు

టీడీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.అందుకే వైసీపీ( YCP ) ఫేక్ పరిశ్రమ తెరపైకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.అదేవిధంగా ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు.

సూపర్ సిక్స్ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.వాలంటీర్లతో( volunteers ) తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే ఏ పార్టీ అభ్యర్థి అయినా ఓట్లు పడే విధంగా మూడు పార్టీల నేతలు కృషి చేయాలని వెల్లడించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు