ఓ దర్శకుడుని మూడు చెరువుల నీళ్లు తాగించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం!

స్వర్గస్తులైనటువంటి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం( SP Balasubrahmanyam ) గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు! నిన్న మొన్నటి వరకు మోగిన కంఠం.

కోవిడ్ మహమ్మారి రూపంలో స్వర్గానికేగింది.

దాదాపు పదివేలకు పైగా పాటలు పాడిన బాలసుబ్రమణ్యం గిన్నిస్ రికార్డుల్లో( Guinness Record ) కూడా స్థానం దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఆయనకి తొలి పాట పాడే అవకాశం అంతా తేలికగా రాకపోగా.ఆ పాట పాడడానికి బాలసుబ్రమణ్యం అప్పటి దిగ్గజ దర్శకుడు కోదండపానికి( Kodandapani ) చుక్కలు చూపించాడట!

శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం "రాగము అనురాగము" అనే పాటను మొట్టమొదటిసారి పాడడం జరిగింది.ఈ పాటను తానే రాసి, ఓ స్టేజి పైన పాడడంతో.ఆ కార్యక్రమానికి వెళ్లినటువంటి కోదండపాణి, బాలసుబ్రమణ్యం ప్రతిభను గమనించి ఆయనకి సినిమాలలో పాడే అవకాశం కల్పించడం జరిగింది.

అలా ఆయన సినిమా తెరంగేట్రం జరిగింది.ఈ క్రమంలోనే కోదండపాణి దర్శకత్వం వహించిన ఓ సినిమాలో పాట పాడమని ఆయనని కోరగా.

Advertisement

మొదట్లో చాలా తడబడ్డారట.ఓ పట్టాన పాట ఓకే కాలేదని.

కోదండపాణి ఈ క్రమంలో చాలా విసుగెత్తి పోయారని ఒక సందర్భంలో బాలసుబ్రమణ్యం గారు చెప్పుకొచ్చారు.

ఆ సందర్భం తర్వాత దాదాపు సంవత్సరంనర కాలం పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యం సినిమాల వైపే కన్నెత్తి చూడలేదట.కానీ ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చిన మార్పులు గురించి అందరికీ తెలిసిందే.గానం అంటే బాలసుబ్రమణ్యం.

బాలసుబ్రమణ్యం అంటేనే గానం! అన్న రీతిలో ఆయన సంగీత సాధన సాగింది.ఇక ఆయన గాయకుడు గానే కాదండోయ్.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

చిత్రాలకు తన గాత్రం కూడా అందించారు.కమల్ హాసన్( Kamal Haasan ) వంటి మహానటులకు ఆయన డబ్బింగ్ చెప్పేవారు.

Advertisement

ఆయన లేనిదే కమల్ హాసన్ సినిమాలు డబ్బింగ్ అయ్యేవి కాదు.ఇక ఆయన కాలం చేసిన తర్వాత ప్రస్తుతం కమల్ హాసన్ తన సొంత గొంతులోనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

అంత డిమాండ్ మన పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గొంతుకి ఉండేది.అయితే నేటి తరంలో ఆయన లాంటి గాయకులను చూడడం ఒక కలగానే మిగిలిపోతూ ఉంది!.

తాజా వార్తలు