kiran abbavaram : ఇక కిరణ్ అబ్బవరం పేరు అందరు మర్చిపోవాల్సిందేనా ?

చాల మంది హీరో అవ్వాలనుకునే వారు 20 రాగానే వారి ట్రయల్స్ మొదలు పెడతారు.

కానీ 26 ఏళ్ళ వయసులో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం( kiran abbavaram ) యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పాపులర్ అయినా కిరణ్ 2019 లో తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు తో వెండి తెర అరంగేట్రం చేసాడు.

ఈ సినిమా తర్వాత అతడి ట్యాలెంట్ చూసి ఖచ్చితంగా మంచి హేర్ అవుతాడు అని అనుకున్నారు.ఇక ఈ చిత్రం తర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం వచ్చి సైలెంట్ గా గట్టి హిట్ కొట్టింది.

దాంతో హీరోగా కిరణ్ సెటిల్ అయినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ ఒక్క సాలిడ్ హిట్ కొట్టాక అందరు తననే గమనిస్తూ ఉంటారు.అలాంటి టైం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చేయాల్సి ఉంటుంది.

2022 లో ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ రాకపోగా కిరణ్ పని అయిపోయింది అని అంతా అనుకోవడం మొదలు పెట్టారు.
సెబాస్టియన్, సమ్మతమే( Sebastian ) మరియు నేను నీకు బాగా కావాల్సిన వాడిని వంటి చిత్రాలు పరాజయం పాలయ్యాయి.ఇక 2023 మొదలయి కేవలం మూడు నెలలు మాత్రమే ముగిసింది.ఈ ఫస్ట్ క్వార్ట్రర్ లో రెండవ నెలలో వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రాన్ని విడుదల చేసిన ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.

Advertisement

ఇక అది విడుదల అయ్యి కేవలం నెల రోజులు గడవకుండానే మీటర్( Meter movie ) అనే మరొక సినిమా విడుదల చేసాడు.ఈ చిత్రం ఘోరంగా విఫలం అయ్యింది.

ఇక మీటర్ విడుదల అయినా మూడో రోజే రూల్స్ రంజన్ అనే కొత్త సినిమా అన్నౌన్స్ చేసాడు.ఇలా గ్యాప్ లేకుండా ఏది పడితే అది తీస్తూ వెళ్తే ఇక పై కిరణ్ అబ్బవరం పేరును అందరు మర్చిపోవడం ఖాయం.

Advertisement

తాజా వార్తలు