హీరో ఉపేంద్ర( Hero Upendra ).కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన దర్శకుడిగా కూడా అనేక చిత్రాలను తీశారు.
ఈ జనరేషన్లో చాలామందికి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదంటే కన్నడలో ఒక సీనియర్ హీరోగా మాత్రమే తెలుసు కానీ కొన్నేళ్లు వెనక్కి వెళితే ఉపేంద్ర నటించిన సినిమాల కు క్రేజీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు పైగా ఆయన తీసే ప్రతి సినిమా టైటిల్ కూడా చాలా భిన్నంగా మరియు వింతగా ఉండేది.90s కిడ్స్ అయితే ఉపేంద్ర సినిమాలంటే పడి చచ్చిపోయేవారు.అయితే కేవలం ఉపేంద్ర మాత్రమే ఇలా క్రేజీ టైటిల్స్ తో సినిమాలు తీసేవారు.
మిగతా హీరోలు అంతా కూడా ఎవరికి తోచినట్టుగా వారు సాధారణ టైటిల్స్ తోనే వెళ్లేవారు.మరి ఉపేంద్ర మాత్రమే ఎందుకు ఇలా చేశారు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆయన సినిమాల లిస్టు చూస్తే ఓం, ఉష్, స్వస్తిక్,A, ఉపేంద్ర, సూపర్( Super )వంటి చిత్రాలతో రిస్క్ తీసుకొని మరి అప్పట్లో ఉపేంద్ర తీసేవారు.అయితే ఈ చిత్రాలన్నీ కూడా ఆయన సొంత దర్శకత్వంలో తెరకెక్కినవే.హీరోగా సినిమాలు తీస్తే రిస్క్ ఎందుకు కానీ తను సొంతగా దర్శకత్వం చేసిన సినిమాలకు మాత్రమే ఇలా వింత టైటిల్స్( Crazy Titles ) పెట్టడం ఉపేంద్రకు అలవాటు.
ఇక ఇలా వింత టైటిల్ పెట్టడం వెనక రీజన్ ఏంటి అని తెలుసుకుంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా చాలా చిన్న హీరో కుమార్ గోవింద్ అనే వ్యక్తితో తీసాడట.పైగా దీని బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్ కావడంతో ప్రమోషన్ చేయాలంటే ఏదో కొత్తగా ఉండాలని భావించి ఉష్ అనే టైటిల్ పెట్టాడట.
ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ దర్శకత్వం చేస్తున్న ఉపేంద్ర తన కొత్త సినిమాకి కూడా UI అనే మరో కొత్త టైటిల్ తో వచ్చాడు.ఇలా పెట్టడంతో జనాల్లో క్రేజ్ ఏర్పడటం మాత్రమే కాదు టైటిల్ చూసి సినిమాను అలాగే సినిమా కథను తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది అనే మరో అభిప్రాయం కూడా ఉపేంద్రకు ఉండటం వల్ల ఇలా పెడుతున్నారట.UI సినిమా విషయానికి వచ్చేసరికి దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది కానీ కేవలం టైటిల్ యానిమేషన్ తప్ప ఈ టీజర్( UI Movie Teaser ) లో ఏమీ ఉండదు.
విజువల్స్ లేకుండా టీజర్ నీ వదిలి స్టోరీని మనల్ని ఊహించుకోమని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు డైరెక్టర్.ఏది ఏమైనా ఉపేంద్ర గారు ఆలోచించే విధానం చాలా భిన్నంగా ఉంటాయి సినిమాతో మళ్ళీ సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy