వైసీపీ ఇంఛార్జుల మార్పులపై కసరత్తు.. రెడీ అవుతోన్న ఐదో లిస్ట్

ఏపీలోని అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP )లో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.

ఈ మేరకు ఐదో లిస్టు కసరత్తు చివరి దశకు చేరుకుంది.

ఇవాళ లేదా రేపు వైసీపీ అధిష్టానం ఐదో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే ఇంతకముందు మార్చిన కొన్ని స్థానాల్లోనూ పార్టీ హైకమాండ్ మరోసారి మార్పులు చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు, నాలుగు స్థానాల్లో మార్పులు జరుగుతాయని టాక్ నడుస్తోంది.ఈ క్రమంలోనే రేపల్లెలో ఇంఛార్జ్ గా గణేశ్ స్థానంలో మోపిదేవి వెంకటరమణ( Mopidevi Venkataraman ), ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా కిరణ్ కుమార్ స్థానంలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును నియమించే అవకాశం ఉంది.అలాగే ఎమ్మిగనూరు ఇంఛార్జ్ వెంకటేశ్ స్థానంలో బుట్ట రేణుకను నియమించే ఛాన్స్ ఉందని సమాచారం.

దీంతో ఐదో లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు