తెరపైకి పీవీ నరిసింహారావు బయోపిక్! రిలీజ్ కి రెడీ అయిన ట్రైలర్

తెలంగాణ ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ రాజకీయాలలో సత్తా చూపించి, దేశ ప్రధానిగా, ఉమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన స్వర్గీయ పీవీ నరసింహారావు జీవిత కథలో ఎన్ని ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి.

ఒక రచయితగా, సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడుగా భారతదేశానికి తెలిసిన పీవీ బహుభాష కోవిదుడు కూడా.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎవరు ఊహించని విధంగా పీవీ బయోపిక్ కూడా తెరపైకి వస్తుంది.

Ex Prime Minister Pv Narasimha Rao Biopic On Sets-తెరపైకి పీ�

అతని చుట్టూ ఉండే వాతావరణం పీవీ ఆలోచనలని ఎలా ప్రభావితం చేసాయి.భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకి పీవీ ఎలా శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ పార్టీ అతనికి ప్రధానిగా ఎందుకు అంత స్థాయి ఇచ్చింది.అనే అంశాలని ఈ బయోపిక్ లో చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

శ్రీకర్ ఫిలింస్ పతాకంపై శ్రావణి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీకర్ నిర్మిస్తున్నారు.లిండ్సే చార్లెస్ సంగీతం అందిస్తున్నారు.తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకి ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారు.మరి ఇందులో పీవీగా కనిపించిన నటుడు ఎవరో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

వినీత్ తెలుగులో సత్తా చాటలేక పోవడానికి కారణం ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు