తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది.ఈ మేరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఎన్నికలకు భారీగా భద్రతా ఏర్పాట్లు జరగగా సుమారు లక్ష మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులలో ఉన్నారు.రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.

ఇప్పటికే కేంద్ర బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.

తెలంగాణ ఎన్నికల భద్రతకు సుమారు 375 కంపెనీల కేంద్ర బలగాల కేటాయింపు జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

ఈ మేరకు 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు సిబ్బందిని కేటాయించారు.మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పిలుపునిచ్చిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు