నిజమా : కరోనా కొత్తేం కాదు, వందేళ్లకు ఒకసారి వస్తూనే ఉందట

చైనాకే పరిమితం అనుకున్న కరోనా వైరస్‌ మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలకు కూడా పాకుతుంది.ఇండియాలో ఇప్పటికే అయిదు కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇక మన హైదరాబాద్‌లో కూడా కరోనా వైరస్‌ బాధితుడు నమోదు అవ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది.ఈ సమయంలోనే సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌ గురించి రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ఈ సందర్బంగా ఒక ఆసక్తికర కథనం ప్రచురితం అవుతుంది.

ఆ కథనం ప్రకారం ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి వైరస్‌లు, జబ్బులు ప్రజలను వేదిస్తూనే ఉన్నాయి.ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఏంటీ అంటే సరిగ్గా వంద ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతోంది.చారిత్రాత్మక ఆధారాల ప్రకారం 1720, 1820, 1920లో ఇలాంటి వైరస్‌ల వల్ల కొన్ని వేల మంది.

Advertisement

లక్షల మంది చనిపోయినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు.ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి విభిన్నమైన విచిత్రమైన పేరుతో ఈ వైరస్‌ మనుషులు ప్రాణాలు తీస్తుందని అంటున్నారు.

ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్థారించారు.గత నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆనవాయితి కొనసాగుతూ వస్తుంది.ఎంతో మందిని ఇప్పటికే బలి తీసుకున్న కరోనా వైరస్‌ ముందు ముందు మరెంత మంది ప్రాణాలను బలి తీసుకుంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

గతంలో ఎంత మంది చనిపోయారు అనేది సరిగ్గా లెక్క అయితే లేదు కాని ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని చరిత్రకారులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

1720లో ప్లేగు వ్యాది కారణంగా వేలాది మంది మృతి చెందారు, 1820లో కలరా వ్యాది కారణంగా లక్షల్లో జనాలు పిట్టల్ల రాలి పోయారు.ఇక 1920లో స్పానిష్‌ ప్లూ అనే వైరస్‌ కారణంగా పలు దేశాల్లో వేల సంఖ్యలో జనాలు చనిపోయారు.ఇక 2020 సంవత్సరంలో కరోనా వల్ల ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది.

మళ్లీ 2120లో ఇదే తరహాలో మరణాలు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు.అప్పటి సంగతి ఏమో కాని ఇప్పుడు విరుగుడు ఎలా అంటూ ప్రపంచం మొత్తం భయాందోళనలు వ్యక్తం చేస్తుంది.

Advertisement

ఇక కొందరు వందేళ్లకు ఒకసారి వస్తున్న ఈ విపత్తును దైవ క్రియ అంటున్నారు.దేవుడు ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

మొత్తానికి కరోనా వైరస్‌ కారణంగా అనేక కొత్త విషయాలు పుట్టుకు వస్తున్నాయి.

తాజా వార్తలు