ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా..: ఎంపీ ఉత్తమ్

కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీతో గెలుస్తానని తెలిపారు.

యాభై వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.ఇప్పుడు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టుగా నిలుస్తాయని చెప్పారు.ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ముప్ఫై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని వెల్లడించారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players