బీఆర్ఎస్ ఆవిర్భావం: కవితమ్మ ఎందుకు దూరంగా ఉన్నారో... ? 

నిన్ననే అట్టహాసంగా  కెసిఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భవించింది.ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ శ్రేణులు అంతా హాజరయ్యారు.

అలాగే టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేస్తూ తీర్మానం కూడా పూర్తయింది.ఇక ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కేసీఆర్ ఆహ్వానించారు.

విశిష్ట అతిధులు అంతా ఈ కార్యక్రమానికి హాజరైనా.జాతీయ పార్టీ ఆవిష్కరణ సమయంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   కెసిఆర్ కుటుంబంతో  విభేదాలు ఉన్నాయని, అందుకే గత కొంతకాలంగా కవిత పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

Advertisement

టిఆర్ఎస్ ఆవిష్కరణ సమయంలో మంత్రి హరీష్ రావు తో పాటు , కేసీఆర్ మిగిలిన కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు.కానీ ప్రగతి భవన్ లోనే ఉన్న కవిత ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది.

గత కొద్ది రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.అంతేకాదు ఈ స్కాం వ్యవహారంపై ఇప్పటికే ఈడి అధికారులు కవిత , కెసిఆర్ సన్నిహితుల ఇళ్లు కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు.

అలాగే కవితకు చెందిన ఆడిటర్ నివాసం,  కార్యాలయాల పైన అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

 దీనికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర అధికార పార్టీ బిజెపి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని వారి అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న  క్రమంలోని ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణంగా తెలుస్తోంది.దీని కారణంగానే కవిత కొత్త జాతీయ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కెసిఆర్ జాతీయ పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తున్నారు.ఏపీ కర్ణాటక తమిళనాడు తో పాటు, మరికొన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసి బిజెపికి చుక్కలు చూపించాలని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు