చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలో గజరాజులు గుంపు బీభత్సం సృష్టిస్తుంది.రామకుప్పం మండలంలో స్వైర విహారం చేసిన ఏనుగులు వ్యవసాయ పంటలను ధ్వంసం చేశాయి.

మణీద్రం, సింగ సముద్రం గ్రామ పరిసరాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి.గత వారం రోజులుగా పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

ఏ క్షణంలో గ్రామాల మీద దాడులకు పాల్పడతాయేమోనని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని వాపోతున్నారు.అటవీ శాఖ అధికారులు స్పందించి గజరాజులను ఫారెస్ట్ లోకి తరిమేయాలని కోరుతున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement