ఈ ఒక్క చిట్కాను పాటిస్తే ర‌క్త‌హీన‌త మీ ద‌రి దాపుల్లోకి కూడా రాద‌ట‌!

ప్ర‌స్తుత రోజుల్లో ర‌క్త‌హీన‌త బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.శ‌రీరంలో స‌రిప‌డా ర‌క్తం లేక‌పోవ‌డ‌మే ర‌క్త‌హీన‌త.

ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల్లో ఇది ఒక‌టి.ఈ ర‌క్త‌హీన‌త వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట‌, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, శ‌రీరం ఎప్పుడు చ‌ల్ల‌గా ఉండ‌టం, తీవ్ర‌మైన త‌ల నొప్పి, ఏకాగ్ర‌త్త లోపించ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

అయిన‌ప్ప‌టికీ దీనిని నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.అందుకే ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను ఎంత త్వ‌ర‌గా వ‌దిలించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను పాటిస్తే చాలా అంటే చాలా సుల‌భంగా ర‌క్త హీన‌త‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంత‌కీ ర‌క్త‌హీన‌త‌ను త‌రిమికొట్టే ఆ చిట్కా ఏంటో లేట్ చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

Advertisement

ముందుగా ఒక బౌల్‌లో ఆరు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్ష పండ్లు, హాఫ్ టేబుల్ స్పూన్ అతిమ‌ధురం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్త‌గా దంచి ఉండ‌లా చేసుకోవాలి.

ఈ ఉండ‌ను రోజు ఉద‌యాన్నే తిని.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను షుగ‌ర్ క‌ల‌ప‌కుండా సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక ఎర్ర ర‌క్త క‌ణాలు పెరిగి ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.

ఫ‌లితంగా ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు మ‌ళ్లీ మ‌ళ్లీ ర‌క్త‌హీన‌త మీ ద‌రి దాపుల్లోకి రాకుండా కూడా ఉంటుంది.

అంతే కాదు, ఎండు ద్రాక్ష‌ల‌కు అతిమ‌ధ‌రం పొడి, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.రాత్రుళ్లు కండి నిండా నిద్ర ప‌డుతుంది.

Advertisement

మ‌రియు గుండె ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.

తాజా వార్తలు