పిగ్మెంటేషన్‌ను నివారించే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మీకోసం!

పిగ్మెంటేషన్‌.చాలా మందిని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

స్కిన్‌పై న‌లుపు లేదా గోధుమ రంగు మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌టాన్నే పిగ్నెంటేష‌న్ అంటారు.

వ‌య‌సు పైబ‌డ‌టం, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను యూజ్ చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, హార్మోన్ ఛేంజ‌స్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్కిన్ పిగ్నెంటేష‌న్‌కు గుర‌వుతుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన క్రీమ్స్‌, సీర‌మ్స్ యూజ్ చేస్తుంటారు.

కొంద‌రైతే పిగ్నెంటేష‌న్ నుంచి బయ‌ట ప‌డేందుకు ట్రీట్‌మెంట్ సైతం చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్‌ను ట్రై చేస్తే గ‌నుక చాలా సుల‌భంగా పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోమ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక చిన్న బంగాళ‌దుంప‌ను తీసుకుని పీల్ తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి.మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బంగాళ‌దుంప జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల రైస్ వాట‌ర్‌(బియ్యం క‌డిగిన నీళ్లు), వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఆ త‌ర్వాత దూది సాయంతో ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రెండు, మూడు సార్లు ఆప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకుని.మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

ఇలా ప్ర‌తి రోజు చేస్తే పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.

Advertisement

మ‌రో విధంగా కూడా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.అందు కోసం మిక్సీ జార్‌లో కొన్ని ఆరెంజ్ తొక్క‌లు, ఒక క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు చిన్న గిన్నె తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడ‌ర్‌, చిటికెడు ప‌సుపు మ‌రియు ఆరెంజ్ పీల్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు