డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‎కు ఈడీ నోటీసులు

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది.కేసుపై విచారణ చేస్తున్న ఈడీ హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

ఈ మేరకు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.ఇటీవలే మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే పలువురు నైజీరియన్లను నార్కోటిక్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.

గత నెల 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లు, ఓ సినీ దర్శకుడితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వీరి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable