ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi liquor scam ) కేసులో కేజ్రీవాల్ కు ఈడీ ఐదోసారి నోటీసులు అందజేసింది.అయితే ఇప్పటివరకు ఈడీ ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే.ఈడీ నోటీసులు అక్రమం అంటూ కొట్టిపారేశారు.

తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగా ఈడీ నోటీసులు( ED notices ) ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఈడీ జారీ చేసిన నోటీసులపై సీఎం కేజ్రీవాల్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు