బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..!

తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా నోటీసులు జారీ చేసింది.

ఇందులో భాగంగా రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని సమాచారం.కాగా ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కూడా గత డిసెంబర్ లో ఆమె ఇంటికి వెళ్లి దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు.అయితే ఈడీ నోటీసులపై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement