సింపుల్ గా కనిపించే ఇసిటీ జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ అదుర్స్..!

భారత మార్కెట్లోకి చూడడానికి చాలా సింపుల్ గా కనిపించే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్( Electric Scoter ) విడుదల అయింది.

ఈ స్కూటర్ ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే.

లెట్రిక్స్ కంపెనీ తాజాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ స్కూటర్ పేరు ఇసిటీ జిప్( Ecity Zip ) . ఈ మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఏమిటో చూద్దాం.ఇది ఒక మిడ్ స్పీడ్ స్కూటర్.

ఇందులో రెండు రకాల మోడ్స్ ఉన్నాయి.ఎకో మోడ్ లో టాప్ స్పీడ్ 35 కిలోమీటర్లు.

అదే మోడ్ 2లో అయితే గంటకు 45 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు.మోడ్ వన్ రేంజ్ లో 75 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు.

Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5 సెకండ్లలో సున్నా నుంచి 20 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఈ స్కూటర్ లో 2kWH బ్యాటరీ అమర్చబడి ఉంది.ఇందులో ప్రత్యేకంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ( Fast Charging Facility ) కూడా అమర్చారు.గ్రౌండ్ క్లియరెన్స్ 165MM.

ఈ స్కూటర్ ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి 12 పైసలు ఖర్చు అవుతుంది.ఈ లెక్క ప్రకారం రూ.12 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.కేవలం ఐదు గంటలలో ఫుల్ ఛార్జ్ ( Full Charge )అవుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వైట్, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అనే కలర్లలో అందుబాటులో ఉంది.ఈ స్కూటర్ కు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

అంతేకాకుండా ఆప్షనల్ బ్యాటరీ బ్యాక్ సెట్ కూడా పొందవచ్చు.ఈ స్కూటర్ లో హెవీ డ్యూటీ బీఎల్డీసీ అమర్చారు.

Advertisement

ఇక లెట్రిక్స్ ఇసిటీ జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర( Ecity Zip Electric Scooter ) విషయానికి వస్తే.రూ.1.15 లక్షలు గా ఉంది.ఈ స్కూటర్ కు ఈజీ లోన్ ఆప్షన్( Easy Loan Option ) కూడా ఉండడంతో ఈఎంఐ పద్ధతిలో ఈ స్కూటర్ను కొనుగోలు చేయవచ్చు.

పర్సనల్ కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది చాలా సింపుల్ గా అనువుగా ఉంటుందని లెట్రిక్స్ కంపెనీ తెలిపింది.

తాజా వార్తలు