పెసలతో టేస్టీగా ఈ లడ్డూను తయారు చేసుకుని రోజు తింటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

పెసలు.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

నవధాన్యాల్లో పెసలు( Mung bean ) ఒకటి.

చూడడానికి చిన్న పరిమాణంలో కనిపించినా.

పెసల్లో పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి.పెసలతో మనం పెసరట్టు, పెసర వడలు తయారు చేసుకుని ఎక్కువగా తీసుకుంటాము.

అలాగే కొందరు పెసలను మొలకెత్తించి తింటూ ఉంటారు.అయితే పెసలతో టేస్టీగా మరియు హెల్తీగా లడ్డూ కూడా తయారు చేసుకోవచ్చు.

Advertisement

పెసలతో లడ్డూ తయారు చేసుకుని రోజుకొకటి చొప్పున తింటే మీ ఆరోగ్యానికి తిరిగే ఉండదు.మరి పెసలతో లడ్డూ ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు బెల్లం తురుము మరియు కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి. బెల్లం( Jaggery ) పూర్తిగా కరిగి బాయిల్ అవుతున్న టైమ్ లో ఆ గిన్నెను పక్కకు దించేయాలి.ఆ వెంటనే స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పెసలు వేసి దోరగా వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న పెస‌ల‌ను మిక్సీ జార్ లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసి అర కప్పు జీడిపప్పు( Cashew ) పలుకులు వేసుకుని వేయించుకోవాలి.జీడిపప్పు వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న పెసలు వేసి వేయించుకోవాలి.మంచిగా ఫ్రై అయ్యాక స్ట‌వ్ ఆఫ్ చేసుకుని.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అందులో పావు స్పూన్ యాల‌కుల పొడి మ‌రియు బెల్లం సిరప్ ని కొంచెం కొంచెం గా వేసుకుంటూ కలుపుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

Advertisement

ఈ పెసల లడ్డూను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.ఎముకలు బలోపేతం అవుతాయి.రక్తహీనత దూరం అవుతుంది.

అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.మధుమేహం, గుండెపోటు వంటి జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కంటి చూపు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.మరియు జీర్ణక్రియ సైతం చురుగ్గా మారుతుంది.

తాజా వార్తలు