ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు.. మరీ ముఖ్యంగా మహిళలకు..

ప్రస్తుతం మారుతున్న జీవన విధానం కారణంగా ప్రతి ఒక్కరూ ప్యాకేజ్డ్ ఫుడ్స్ పై ఆధారపడాల్సి వస్తోంది.

ప్రయాణ సమయంలో లేదా స్నాక్స్ తినడానికి కచ్చితంగా ప్యాకేజ్డ్ ఆహారం తినవలసిన పరిస్థితి ఏర్పడింది.

అలాగే అల్ట్రా పాసెస్ చేసిన ఆహారాలు అంటే ఫిజి డ్రింక్స్ ప్యాకేజ్ చేసిన బ్రెడ్ అలాగే తినడానికి సిద్ధంగా ఉండే భోజనం, అల్పాహారం, తృణధాన్యాలు వంటివి తరచూ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది ఎక్కువగా మహిళలలో అండాశయా, రొమ్ము, క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా నివేదికల ప్రకారం తీసుకునే ఆహారంలో 10% అల్ట్రా ప్యాకేజ్డ్ ఆహారం వాడకం పెరిగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెండు శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.అదే అండాశయ క్యాన్సర్ లో అయితే 19 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

అయితే ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అల్ట్రా పాసెస్ చేసిన ఫుడ్ లో 10% వినియోగం పెరిగితే క్యాన్సర్ పెరుగుదల మరణాల్లో ఆరు శాతం పెరుగుదలతో పాటు, రొమ్ము క్యాన్సర్ 16% పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే అండాశయా క్యాన్సర్ పెరుగుదల 30 శాతం వరకు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ప్యాకేజ్డ్ ఫుడ్ కేవలం క్యాన్సర్ ప్రమాదాన్ని మాత్రమే ఇతర ఆరోగ్య సమస్యలు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

యూకే లో ఇటువంటి పరిశోధనల్లో పెద్దవారిలో, పిల్లలలో ప్యాకేజీ ఆహారం వినియోగం కారణంగా భవిష్యత్తులో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసింది.

అంతేకాకుండా పెద్దలలో టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందని వెలుడైంది.అలాగే పిల్లల్లో అయితే బాల్యం నుంచి యవ్వనం వరకు అధిక బరువు సమస్యతో బాధపడతారని తెలిసింది.సాధారణంగా యూకేలో రోజువారి ఆహారంలో సగానికి పైగా ప్యాకేజ్డ్ ఫుడ్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ప్యాకేజ్డ్ ఫుడ్ ఫ్రెష్ గా ఉండడానికి వివిధ రసాయనలో కలుపుతున్నారు.దీనివల్ల ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతోంది అని ఐక్యరాజా సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధికారులు తెలిపారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు