ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం..: త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు

పార్టీలను ఉద్దేశించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుందన్నారు.

పరిస్థితి ఏదైనా సిద్ధాంతాలకు అనుగుణంగా పరిపాలన చేయాలని తెలిపారు.అందరూ కలిసి మెలిసి ఉండేలా చూడాల్సిన బాధ్యత పార్టీలదేనని పేర్కొన్నారు.

సందర్భం వచ్చినప్పుడు ఇతరుల లోపాలను ఎత్తి చూపడం తప్పు కాదని చెప్పారు.మిగతా సందర్భాల్లో కలిసి మెలిసి పని చేయాలని వెల్లడించారు.

కానీ ప్రస్తుతం పార్టీలను చూస్తుంటే అలాంటి పరిస్థితి లేదని తెలిపారు.నేతలు దూషించుకోవడంతో ప్రజలకు మంచి జరగదన్న ఆయన అందరూ కలిసి ఉండాలన్నదే తమ కోరికని స్పష్టం చేశారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు